'సైరా' గురించి ఆ క్రికెటర్‌ ఏమన్నాడో తెలుసా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ మెగాస్టార్‌ అయిన చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' మంచి విజయం సాధించాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులే కాదు, ఇతర ప్రముఖులు కూడా సోషల్‌ మీడియా వేదికగా తమదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్వీట్స్‌ కా బాప్‌ అయిన రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గా ట్వీట్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ మధ్య. తాజాగా ఓ క్రికెటర్‌ 'సైరా'పై తన స్వీట్‌ కామెంట్‌ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు.

 

ఆయన మరెవరో కాదు, కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన శ్రీశాంత్‌. ఇప్పుడీయన క్రికెట్‌కి దూరంగా ఉంటున్నారు. కానీ, సినీ ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్నారు. గత బిగ్‌బాస్‌ (హిందీ) సీజన్‌లో వన్‌ ఆఫ్‌ ది కంటెస్టెంట్‌గా ఉన్నాడు కూడా. తాజాగా ఈయన 'సైరా' గురించ ఏమన్నాడంటే, ''సైరా నరసింహారెడ్డి' టీజర్‌, ట్రైలర్స్‌ చూశాను. బాహుబలి కంటే భారీ సినిమాలా కనిపిస్తోంది.

 

తప్పకుండా నేను ఈ సినిమా చూస్తాను..' అంటూ చిరంజీవి నటించిన 'సైరా' సక్సెస్‌ అవ్వాలని అన్నాడు. అంతేకాదు, క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ లెజెండ్‌ అయితే, సినిమాల్లో చిరంజీవి లెజెండ్‌ అని పేర్కొన్నాడు. శ్రీశాంత్‌ ట్వీట్‌కి నెట్టింట్లో హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మరోవైపు విలక్షణ నటుడు మోహన్‌బాబు కూడా 'సైరా' అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ ట్వీట్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS