బిగ్‌బాస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ మొదట్లో గేమ్‌కి పనికి రాడు. ప్రతీ దానికీ గివ్ అప్ అనేస్తాడు. టాస్క్‌లు సీరియస్‌గా తీసుకోడు. అసలు గేమ్‌నే సీరియస్‌గా తీసుకోలేదు. సో రెండు మూడు వారాల కన్నా ఎక్కువగా హౌస్‌లో ఉండడం కష్టమే అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా రాహుల్ ఎనర్జిటిక్ అయ్యాడు. జీరో నుండి హీరోగా ఎదిగాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న ఫస్ట్ కంటెస్టెంట్‌గా రాహుల్ ఈ సీజన్‌కి ఘనత దక్కించుకున్నాడు. చాలాసార్లు నామినేట్ అయ్యి, సేవ్ అయ్యాడు. అంటే అభిమానులు తనపై పెట్టుకున్న అభిమానానికి తానేం బహుమతి ఇవ్వాలి అని, రియలైజ్ అయ్యాడు.
సెకండాఫ్ నుండీ గేమ్‌ని సీరియస్‌గా తీసుకున్నాడు. పడి లేచిన కెరటంలా ముందుకు దూసుకొచ్చాడు. టాస్క్‌ల్లో ఎనర్జిటిక్‌గా పాల్గొన్నాడు. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం స్టార్ట్ చేశాడు. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా మారాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్లకి గట్టి పోటీగా నిలిచాడు. మంచి హెయిర్ స్టైలిష్ట్. బిగ్‌బాస్ విన్ అయితే ఆ డబ్బుతో బార్బర్ షాప్ పెట్టాలనుకుంటున్నానని చెప్పి, తన వృత్తిని గౌరవించడంలో ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఇంత మంచి నడవడిక ఉంది కానీ, చిన్న విషయానికే కోపం ప్రదర్శిస్తాడు. శ్రీముఖిపై చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యాడు. అదే రాహుల్‌కి పెద్ద మైనస్‌గా మారింది. కానీ, పునర్నవితో లవ్ ట్రాక్ రాహుల్‌కి బాగా కలిసొచ్చిన అంశం. దాంతోనే రాహుల్‌కి ఊహించని ఫాలోయింగ్ వచ్చేసింది.
ఒకవేళ బిగ్‌బాస్ టైటిల్ గెలిస్తే, తనకోసం ఫ్యాన్స్ ఫెరారీ కారు సిద్ధంగా ఉంచారనీ, బిగ్‌బాస్ ట్రోఫీతో ఆ కారులో ఊరేగింపుగా వెళతాడనీ, అలీ, రాహుల్ సరదాగా డిస్కస్ చేసుకున్నారు. అది నిజం చేసేందుకే అభిమానులు కంకణం కట్టుకున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బట్టి అర్ధమవుతోంది. సో రాహుల్‌కీ విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.