'హలో' బ్యూటీని మాతృభూమి పిలుస్తోంది.!

మరిన్ని వార్తలు

'హలో' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్‌. తొలి సినిమాకే యాక్టింగ్‌ టాలెంట్‌లో తానేంటో ప్రూవ్‌ చేసుకుంది. లక్‌ కలిసి రాక సినిమా హిట్‌ కాలేదు. కానీ, నటిగా కళ్యాణి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వచ్చిన 'చిత్రలహరి' సినిమా ఆమె కెరీర్‌లో హిట్‌ సినిమాగా నిలిచింది. తదుపరి 'రణరంగం' ఓ మోస్తరు హిట్‌ అందుకుంది. స్వతహాగా మలయాళ కుట్టీ అయిన అమ్మడు సొంత భాషలో చేసిన సినిమాలు కూడా తక్కువే. ప్రస్తుతం అక్కడ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ కళ్యాణి తలుపు తట్టిందట.

 

ఆల్రెడీ గతంలో ఓ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించిన కళ్యాణి ఈ సినిమాతో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా నటించనుందదట. దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లింది. ఇదిలా ఉంటే, తెలుగులోనూ మరి కొన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట.

 

గ్లామర్‌, ఎక్స్‌పోజింగ్‌ విషయంలో పాప కాస్త దూరంగా ఉంటుంది. సో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలైతేనే అమ్మడిని వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం అలాంటి సబ్జెక్టులు చాలా తక్కువగా తెరకెక్కుతోన్న కారణంగా కళ్యాణి వంటి టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌కి అవకాశాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి, తన టాలెంట్‌తో ఇంకెన్ని కొత్త ఛాన్సులు దక్కించుకుంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS