ఎట్టకేలకు బాబా భాస్కర్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. కానీ, ఈ కెప్టెన్సీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే, కెప్టెన్సీ కోసం పాల్గొన్న టాస్క్ అంత స్పోర్టివ్‌గా లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. రాహుల్, వరుణ్ వద్ద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అసలు బాబా భాస్కర్ అసహనానికి కారణమెవరంటే, బాబా భాస్కర్‌తో చంద్రముఖిగా పిలవబడే శ్రీముఖి.
శిల్పా చక్రవర్తి కారణంగానే బాబా భాస్కర్ గెలిచాడని ఆమె చెప్పింది. ఆ మాటలు బాబాని హర్ట్ చేశాయి. ఈ టాస్క్‌లో తాను చేసిందేమీ లేదనీ బాధపడ్డారు. ఇలాంటి ఓ కెప్టెన్సీ తనకు వద్దన్నారు ఆయన. రాహుల్, వరుణ్ సర్ది చెప్పడంతో ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇక తను కెప్టెన్ అయితే, హౌస్‌లో ఆడవాళ్లు షార్ట్ డ్రస్సులు వేసుకోరాదనీ, అలీ రైజా స్నానం చేసిన తర్వాత షర్టు లేకుండా ఇంట్లో తిరగకూడదనే రూల్స్ పెడతాను.. అని గతంలో బాబా భాస్కర్ చెప్పారు. మరి ఆ రూల్స్ ఇప్పుడు ఫాలో చేస్తారా? వరుస టాస్క్‌ల నిమిత్తం ఈ వారమంతా ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగింది. బాబా కెప్టెన్సీలో ఈ యాక్షన్ కాస్తా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోనుందా? చూడాలి మరి.