'మందు, సిగరెట్, అమ్మాయిల్లా శత్రువు కూడా ఓ వ్యసనమే. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే..' అంటున్నాడు విలక్షణ నటుడు శ్రీ విష్ణు. ఆయన నటించిన తాజా చిత్రం 'తిప్పరా మీసం' టీజర్‌ని లేటెస్ట్‌గా విడుదల చేశారు. ఆ టీజర్‌లోనివే ఈ డైలాగులు. ఫస్ట్‌లుక్‌నే ఎంతో ఆసక్తిగా వదిలిన చిత్రయూనిట్, టీజర్‌ని అంతకు మించిన ఆసక్తిగా డిజైన్ చేశారు. ఫుల్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తోంది టీజర్ నిండా.
పొడుగాలి జుట్టు, గెడ్డం, మెలిదిరిగిన మీసంతో డిఫరెంట్ అండ్ రగ్గ్‌డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు శ్రీ విష్ణు. తొలి డైలాగ్‌తోనే సినిమాలో సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని శ్రీ విష్ణు చెప్పకనే చెప్పేశాడు. శ్రీ విష్ణు వ్యసనంగా అభివర్ణించిన ఆ శత్రువు ఎవరు.? ఇంతకీ ఎందుకు అతనితో అంతటి శత్రుత్వం అనేది తెలియాలంటే 'తిప్పరా మీసం' సినిమా చూడాల్సిందే. కృష్ణ విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. 'చీకట్లో చితక్కొట్టుడు' ఫేం నిక్కీ తంబోలీ, శ్రీ విష్ణుకి జోడీగా నటిస్తోంది. పక్కింటబ్బాయ్ ఇమేజ్‌తో హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రకరకాల వేరియేషన్స్‌లో కనిపించి, తనదైన స్టైల్ చూపించే శ్రీ విష్ణు 'తిప్పరా మీసం'తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక.