అలీ రెజా రీ ఎంట్రీ: బిగ్‌బాస్‌కి తెచ్చిన తంటా!

మరిన్ని వార్తలు

బిగ్‌హౌస్‌లోకి ఫస్ట్‌ ఎంట్రీ ఎవరిస్తున్నారు? అనే విషయం ఆడియన్స్‌కి తెలియదు. కానీ, హౌస్‌లోకి వన్స్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరు హౌస్‌లో ఉండేందుకు అర్హులు, ఎవరు అనర్హులు.. అనే విషయం ఫైనల్‌గా తేల్చాల్సింది మాత్రం ఆడియన్సే. అలాగే, ఆ తర్వాత హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే వాళ్ల విషయంలోనూ ఆడియన్స్‌ డెసిషనే ఫైనల్‌. కానీ, బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ఆడియన్స్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతోంది.

 

తాజాగా అలీ రెజా రీ ఎంట్రీ జరిగింది. ఇంట్లో ఉండేందుకు అర్హుడు కాదని అలీ రెజాని తక్కువ ఓట్లు వేసి ఆడియన్స్‌ బయటికి పంపించారు. అలాంటి అలీ రెజాని మళ్లీ ఆడియన్స్‌ అనుమతి లేకుండా, ఓటింగ్‌ ప్రక్రియ జరగకుండా ఎలా మళ్లీ హౌస్‌లోకి పంపిస్తారు..? అని నెటిజన్స్‌ వాదిస్తున్నారు. అలీ రెజా రీ ఎంట్రీ విషయమై అస్సలు ఓటింగే జరగలేదు. ఆప్షనే ఇవ్వలేదు. దాంతో భారీగా డబ్బులిచ్చి అలీ రెజా ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడనే వాదన వినిపిస్తోంది. అంత చీప్‌గా బిగ్‌బాస్‌ టీమ్‌ వ్యవహరిస్తోందంటూ దుమ్మెత్తిపోస్తోంది. ఇలా అయితే, బిగ్‌బాస్‌ని బ్యాన్‌ చేస్తామంటూ ఆందోళన చేస్తోంది. ఇంటి బయట పరిస్థితి ఇలా ఉంటే, హౌస్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఏకంగా హోస్ట్‌ నాగార్జునకిచ్చిన ఎంట్రీ మాదిరి అందమైన అమ్మాయిల భీభత్సమైన డాన్సుల మధ్య అలీ రెజా ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది.

 

ఇదంతా చూస్తుంటే, ఖచ్చితంగా అలీ రెజా ఏదో మానిప్లేట్‌ చేశాడు. ఆ చీప్‌ మానిప్లేషన్‌కి బిగ్‌బాస్‌ టీమ్‌ ఎలా పడిపోయింది.. అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరిగిపోతోంది. ప్రీ క్లైమాక్స్‌లో బిగ్‌బాస్‌ వివాదం మరోసారి రచ్చ రేపింది. ఈ తాజా వివాదాల నడుమ అలీ రెజాని హౌస్‌లో కొనసాగిస్తారా.? నెటిజన్స్‌ రచ్చకి ఆన్సర్‌ ఇస్తారా.? బిగ్‌ హౌస్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS