'శివజ్యోతితో జాగ్రత్త': హెచ్చరించిన అలీ భార్య.!

మరిన్ని వార్తలు

హౌస్‌ మేట్స్‌ కుటుంబ సభ్యులు బిగ్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలు పెట్టారు. వారిలో అలీ రెజా భార్య మసుమ ఎంట్రీ కాస్త రొమాంటిక్‌గా అనిపించింది. హీరో, హీరోయిన్‌ రేంజ్‌లో ఉన్న ఈ జంట అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ఎంట్రీలోనే హీరోయిన్‌కిచ్చినంత బిల్డప్‌ ఇచ్చారు మసుమకి. అయితే, మసుమ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో హౌస్‌ మేట్స్‌ స్లీప్‌ మోడ్‌లో ఉన్నారు. స్లీప్‌ మోడ్‌లో సోఫాలో పడుకుని ఉన్న ఆలీరెజా తలని తన ఒళ్లోకి తీసుకుని మసుమ ముద్దులతో ముంచెత్తింది.

 

ఆ పక్కనే ఉన్న రాహుల్‌ ఆమె తలలో చేయి పెట్టి, తను శివజ్యోతి ఏమో అనుకున్నాడు. శ్రీముఖి అనుకుని, మసుమ చెంపపై కొట్టింది శివజ్యోతి. స్లీప్‌ మూడ్‌ రిలీజ్‌ అయ్యాకా తెలిసింది వచ్చింది మసుమ అని. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌ అందర్నీ హార్ట్‌ఫుల్‌గా పలకరించింది మసుమ. బెడ్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి, భర్త అలీ రెజాకి కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా 'శివజ్యోతితో జాగ్రత్త' అని వార్నింగ్‌ ఇచ్చింది.

 

శివజ్యోతితో రిలేషన్‌ కారణంగా నీకు నష్టం జరిగే అవకాశాలున్నాయి. సో నీ గేమ్‌ నువ్వు ఆడు, ఆమెకు హెల్ప్‌ చేసే ఉద్దేశ్యంలో అందరికీ అవకాశమివ్వకు, నీ గేమ్‌ నువ్వు కోల్పోకు.. అంటూ అలీ రెజాకి సూచించింది. 'టైటిల్‌ గెలిచే ఇంటికి రా' అని చెప్పి వెళ్లింది. శ్రీముఖిని 'లౌడ్‌ స్పీకర్‌ అంటూ, నువ్వు లేకపోతే హౌస్‌ లేదు..' అని పొగిడేసింది. రాహుల్‌ స్మైల్‌ అంటే ఇష్టమని చెప్పింది. మొత్తానికి మసుమ హౌస్‌లో చేసిన సందడికి బిగ్‌బాస్‌ ఆడియన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS