స్టాలిన్ జోడీ... మ‌ళ్లీ మ‌రోసారి?

By Gowthami - October 17, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

స్టాలిన్‌లో చిరంజీవితో తొలిసారి జోడీ క‌ట్టింది త్రిష‌. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. పైగా చిరంజీవి కూడా సినిమాల నుంచి రాజ‌కీయాలవైపు వెళ్లిపోయారు. అందుకే చిరు - త్రిష జోడీ మ‌ళ్లీ చూసే అవ‌కాశం రాలేదు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఈ స్టాలిన్ జోడీ క‌నువిందు చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇందులో క‌థానాయిక‌గా అనుష్క, న‌య‌న‌తార‌, కాజ‌ల్ లాంటి సీనియర్ల పేర్లుప‌రిశీలిస్తున్నారు. ఈ జాబితాలో త్రిష పేరు కూడా చేరింది. ఒక‌వేళ పై ముగ్గురూ కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోతే, త్రిష‌ని తీసుకుంటారు. త్రిష‌తో పాటుగా మ‌రో క‌థానాయిక కూడా ఉండే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. అంతేకాదు.. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS