ఈ ఏడాది 'ఎఫ్ 2'తో సూపర్ విక్టరీ అందుకున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో కో స్టార్‌గా వర్క్ చేసిన వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' తర్వాత 'గద్దలకొండ గణేష్'తో ఇంకో హిట్‌నీ కంటిన్యూ చేసేశాడు. ఇక ఇప్పుడు వెంకీ టర్న్ వచ్చింది. వరుణ్‌తో 'ఎఫ్ 2' చేసిన వెంకీ, మళ్లీ మల్టీ స్టారర్‌నే ఎంచుకున్నాడు. ఈ సారి రియల్ మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ'గా వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రూపంలో సినిమాపై ఆసక్తిని బాగానే పెంచేశారు.
అయితే, ఈ సినిమాని నిన్న మొన్నటి దాకా సంక్రాంతికి విడుదల చేస్తామనుకున్నారు. కానీ, డిశంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. అంటే, ఇయర్ ఎండింగ్‌లోనే వెంకీ ఇంకో సినిమాతో వచ్చేయాలనుకుంటున్నాడన్న మాట. ఈ ఏడాది డిశంబర్ పోరు చాలా గట్టిగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాల వరకూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎవరి ప్రత్యేకత వారిదే అన్నట్లుగా అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి ఆయా సినిమాలు.
వాటిలో 'వెంకీ మామ' సినిమా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. మల్టీ స్టారర్ కావడం, పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం, గ్లింప్స్‌లో మామా అల్లుళ్ల సందడి ఎట్రాక్ట్ చేస్తుండడం, ఇద్దరు ముద్దుగుమ్మలు పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలతో కమర్షియల్‌గా ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశాలుండడం తదితర అంశాలు ఈ సినిమాని సక్సెస్ బాటలో నడిపించేవిగా కనిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి, తోడల్లుడు వరుణ్ 'గద్దలకొండ గణేష్'గా వచ్చి రెండో హిట్ ఎత్తుకెళ్లిపోయాడు. మరి 'వెంకీమామ' కూడా తన రికార్డు బ్రేక్ చేస్తాడా? చూడాలిక.