మొన్న జరిగిన కాటమరాయుడు ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు పవన్ ఒక్కసారిగా గట్టిగా నవ్విన విషయం గుర్తుండే ఉంటుంది.
అలా ఒక్కసారిగా పవన్ ఎందుకు నవ్వాడో అని అందరూ చర్చించుకున్నారు. ఇది ఒక పెద్ద సస్పెన్స్ లా మారి ఏం జరిగి ఉంటుంది అలాగే అలీ అంతగా ఏం అన్నాడో అని అందరు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకున్నారు.
అయితే ఆ సస్పెన్స్ కి అలీ ఆరోజు తను ఏం చెప్పాడో అందరికీ చెప్పి ఆ సస్పెన్స్ కి తెరదించేశాడు. ఆయన చెప్పినదాని ప్రకారం, శరత్ మరార్ పవన్ ని పొగుడుతూ “హ్యాండ్సం గా ఉన్నారూ” అనేసరికి పక్కనే ఉన్న అలీ- “ఐతే ఇప్పుడు వెంటనే మళ్ళీ పెళ్లిచేస్తాడా ఏంది!” అని అనేసరికి అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.
దీంతో ఆరోజు పవన్ ఆ రేంజ్ లో నవ్వడానికి గా కారణం అందరికీ తెలిసినట్టయింది.