శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'రోబో 2.0'. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో జర్నలిస్టుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటన ఇప్పుడు తీవ్రరూపం దాల్చి, డైరెక్టర్ శంకర్ క్షమాపణలు చెప్పేంత వరకూ వెళ్లింది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లోకి ఎంటైరైన జర్నలిస్టులపై ఆసిస్టెంట్ డైరెక్టర్, చిత్ర యూనిట్ సిబ్బంది దాడి చేశారు. దాంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. స్పాట్‌లో ఫోటో తీశాడనే నెపంతో ఓ జర్నలిస్టును గాయపరిచారు చిత్ర యూనిట్. అయితే మొదట్లో ఈ విషయంలో ఫోటోలు తీశాడని మేము అతన్ని వారించాం. తప్ప కొట్టలేదు అంటూ చిత్ర యూనిట్ బుకాయించింది. కానీ తర్వాత మొత్తం జర్నలిస్టులు ఏకమయ్యి వివాదాన్ని పెద్దది చెయ్యడంతో, విషయం డైరెక్టర్ శంకర్ వద్దకు వెళ్లింది. దాంతో డైరెక్టర్ శంకర్ ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో మీడియా సోదరులకు క్షమాపణలు చెప్పారు. అలాగే ఇంకెప్పుడూ ఇలాంటివి పునరావృతం కావని ఆయన తెలిపారు. దాంతో జర్నలిస్టులు ఆందోళన అయితే విరమించారు కానీ, తమపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా శంకర్ షూటింగ్ స్పాట్‌కి ఇతరులనెవ్వరినీ అనుమతించరు. అందుకే సెక్యూరిటీ సిబ్బంది కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఉండొచ్చు. ఏది ఏమైనా అతి జాగ్రత్తే ఇంతిలా కొంప ముంచేసింది.