అలియా టాలీవుడ్‌కొస్తుందయా.!

మరిన్ని వార్తలు

'ఆర్‌ఆర్‌ఆర' సినిమా కోసం బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. తెలుగులో సినిమా అంటూ చేస్తే ఎన్టీఆర్‌తోనే చేస్తాననీ, ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమనీ ఈ క్యూట్‌ బ్యూటీ గతంలో పలుమార్లు చెప్పింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా నటిస్తున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా కోసం ఎన్టీఆర్‌కి జోడీగా అలియా భట్‌ని టాలీవుడ్‌కి తీసుకురానున్నారనీ టాక్‌ ప్రచారంలో ఉంది.

 

ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ హీరోయిన్స్‌ పేర్లు బయటికి రాలేదు. అయితే ఖచ్చితంగా ఈ సినిమాలో హీరోయిన్స్‌ని ఫ్రెష్‌గా చూపించనున్నారనీ తెలుస్తోంది. అందుకోసం బాలీవుడ్‌ భామలపైనే రాజమౌళి కన్నేసినట్లు ఫిలిం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో తాజాగా అలియాభట్‌ పేరు తెరపైకి వచ్చింది. 

ఒకవేళ ఇదే జరిగితే అలియాభట్‌ కోరిక తీరుతుంది. టాలీవుడ్‌కి ఓ ఫ్రెష్‌ హీరోయిన్‌ పరిచయమయినట్లు అవుతుంది. ఆల్రెడీ బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ 'భరత్‌ అనే నేను'లో మహేష్‌ సరసన నటించి, ఇప్పుడు చరణ్‌ పక్కన చిందేస్తోంది. అలాగే 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో చరణ్‌ కోసం కూడా మరో బాలీవుడ్‌ బ్యూటీనే ఎంపిక చేసే యోచనలో జక్కన్న అండ్‌ టీమ్‌ ఉన్నారట. 

ఇటీవలే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS