RRR షూటింగ్ దాదాపుగా మూడొంతులు పూర్తయ్యింది. కాకపోతే... హీరోయిన్లు లేకుండానే ఇంత షూటింగ్ జరిగిపోయింది. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో ఆ ట్రాక్ ఇప్పటి వరకూ తీయలేదు. అలియా భట్ డేట్లు దొరక్కపోవడ వల్ల తాను కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు. ఇప్పుడు హీరోయిన్ ట్రాకులకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ (ఒలివియా మారిస్) దొరకడంతో ఆ ట్రాక్‌ని కూడా తెరకెక్కించబోతున్నారు. ముందుగా అలియాభట్ రంగంలోకి దిగుతోంది.
వచ్చేవారం అలియా - రామ్‌చరణ్‌లపై ఓ పాట తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ ప్రత్యేకమైన సెట్‌ని రూపొందిస్తున్నారు. ఆ వెంటనే కొన్ని కీలక సన్నివేశాల్నీ తెరకెక్కిస్తారు. అలియా భట్ పై షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ - ఒలివియా ఎపిసోడ్ మొదలవుతుంది. ఇక నుంచీ.. అసలు ఎలాంటి గ్యాప్స్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకే యుద్ధ ప్రాతిపదికన షూటింగ్ జరుగుతోంది.