యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటనతో పాటు స్టైల్ పరంగా కూడా మంచి పాపులారిటీని మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ ట్రై చేస్తూ ఇంతకుముందెన్నడూ ఏ తెలుగు హీరో కనిపించని విధంగా కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి ఈ సెన్సేషనల్ హీరో క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గట్టిగానే వినిపిస్తోంది. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఒక్క సినిమా చేయకుండానే.. అక్కడ విజయ్ కున్న పాపులారిటీ చూసి తెలుగు హీరోలు జెలసీ ఫీల్ అవుతున్నారట.
బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరుణ్ జోకార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దేశవ్యాపంగా 100 మంది ప్రముఖ నటుల జాబితా తయారు చేస్తే అందులో టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ పేరు ఉండటం నిజంగా విశేషమే. దీనికితోడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కొందరు విజయ్ దేవరకొండ తమ ఫెవరేట్ హీరో అని డైరెక్ట్ గానే చెప్పి ఆశ్చర్యం కలిగించారు.
తాజాగా ముంబై వేదికగా జరుగుతున్న ఫిలిం ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుకలో ఈ ఏడాదికి గానూ మీకు నచ్చిన గ్లామర్ అండ్ స్టైలిష్ నటుడు ఎవరని 'అలియా భట్'ని అడుగగా, ఆమె ఆలోచించకుండా విజయ్ దేవరకొండ అని.. అంతే కాకుండా విజయ్ అమేజింగ్ స్టార్ అని కూడా చెప్పుకొచ్చింది. దీనిబట్టి మనోడి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయినా టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఎందరో ఉండగా బాలీవుడ్ బ్యూటీలకు కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఎందుకు నచ్చుతున్నాడో ?