హైదరాబాద్ లో దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రియాంక హత్యోదంతంపై పలువురు స్టార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆ ఘటనకు కారకులైన దోషులకు మరణదండన విధించాలని వివరించారు
దిశ హత్యచారం లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, దిశకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరిపి తొందరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులు కలిశారు. `మా` జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.. ఉపాధ్యక్షురాలు హేమ.. అనిత చౌదరి.. జయలక్ష్మి తనీష్, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీరామ్.. రవి ప్రకాష్ తదితరులు గవర్నర్ కి విన్నవించారు.