ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. `ఆచార్య` తరవాత కొరటాల, `ఆర్.ఆర్.ఆర్` తరవాత ఎన్టీఆర్ పట్టాలెక్కించే ప్రాజెక్టు ఇదే. కథ ఎప్పుడో లాక్ అయిపోయింది. హీరోయిన్ గా అలియాభట్ ని అనుకున్నారు. ఆమెకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సడన్ గా ప్లేటు పిరాయించింది. ఈ సినిమాలో నటించడానికి తనకు కాల్షీట్లు అందుబాటులో లేవని తేల్చి చెప్పేసింది. దాంతో.. ఇప్పుడు మరో హీరోయిన్ ని ఎంచుకునే పనిలో పడింది చిత్రబృందం.
అలియా హ్యాండ్ ఇవ్వడంతో.. కొరటాల కొత్త ఆప్షన్లను వెదికడం మొదలెట్టాడట. కొరటాల దృష్టి రష్మికపై ఉందని టాలీవుడ్ టాక్. ఎన్టీఆర్ - రష్మిక ఇప్పటి వరకూ నటించలేదు. కాబట్టి.. ఈ జోడీ చూడ్డానికి కొత్తగా ఉంటుందని కొరటాల భావిస్తున్నాడట. కాకపోతే... రష్మిక కూడా ఫుల్ బిజీ. ఎన్టీఆర్ సినిమాకి కాల్షీట్లు ఇవ్వగలిగేంత ఖాళీ ఉందా, లేదా? అనేది అనుమానమే. ఇటీవల రష్మిక కొన్ని పెద్ద ప్రాజెక్టులను కాల్షీట్లు సర్దుబాటు చేయలేకే వదిలేసింది. మరి ఈసారి ఏం చేస్తుందో?