చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఆచార్య. రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈనెల 29న విడుదల అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి దర్శక ధీరుడు.. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. అయితే... ఈ ఈవెంట్ లో మరో విశేషం కూడా ఉంది. `శోభన్‌బాబు - శ్రీదేవి`లను కూడా ఈ ఫంక్షన్‌లో చూడొచ్చు. అదెలా అనుకుంటున్నారా? సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా `శ్రీదేవి .. శోభన్ బాబు`. ఈ ట్రైలర్‌ని ఆచార్య ఈవెంట్ లో విడుదల చేయనున్నారు. ఓ సినిమా వేడుకలో మరో సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాకీ.. మెగా ఫ్యామిలీకి లింకు ఉంది. అందుకే... ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందుకే.. ఆచార్యకీ.. ఈ సినిమాకీ లింకు ఏర్పడింది. కూతురి సినిమాని ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఆచార్య వేడుకని వేదికగా మార్చుకున్నారన్నమాట.