కథానాయికల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మోజులో - బాలీవుడ్ కథానాయికల్ని దిగుమతి చేసుకోవడంవ తప్పనిసరి అయ్యింది. తమ డిమాండ్ ని పసి గట్టిన హీరోయిన్లు ఒక్కసారిగా రేటు పెంచేస్తున్నారు. అలియా భట్ అదే చేసింది. కేవలం 15 నిమిషాల పాత్ర కోసం ఏకంగా 5 కోట్లు లాగేసింది.
ఆర్.ఆర్.ఆర్లో అలియాభట్ ఓ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలియా కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. అందుకోసం 5 కోట్ల పారితోషికం అందుకుంది. నిజంగా ఇదో రికార్డ్. సాధారణంగా ఓ బాలీవుడ్ చిత్రానికి అలియా అందుకునే పారితోషికం 5 కోట్లు ఉంటుంది. కాకపోతే.. ఒక్కో సినిమాకి కనీసం 2 నెలల సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆర్.ఆర్.ఆర్ కోసం వారం రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చింది. ఆ వారంలోనే అలియాకు సంబంధించిన పార్ట్ మొత్తం తీసేశారు. అలా.. కేవలం 15 నిమిషాల పాత్ర కోసం 5 కోట్లు అందుకుంది. అలియా వల్ల... బాలీవుడ్ లో ఈ సినిమాకంటూ ప్రత్యేకమైన మైలేజీ వస్తుందన్నది నిర్మాత ఆశ. కానీ.. అలాంటిదేం జరగలేదు. ఇది రాజమౌళి సినిమాగానే బాలీవుడ్ వెళ్తోంది. అలియా వల్ల వచ్చిన అదనపు మైలేజీ ఏం లేదు. అలాంటప్పుడు.. రూ.5 కోట్లు ఎలా ఇచ్చారో?