బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మీద ‘ఆర్‌ఆర్‌ఆర్’కి సంబంధించి మళ్ళీ రూమర్స్ షురూ అయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం విదితమే. మొత్తంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి దేశమంతా. దాంతో, చాలా సినిమాల షెడ్యూల్స్ అతలాకుతలైపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. లాక్‌డౌన్ ఎత్తేశాక, నటీనటులు, టెక్నీషియన్లు.. ఏ సినిమాకి ఎలా స్లాట్స్ ఇవ్వాలో తెలియక నానా తంటాలూ పడాల్సిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై ఈ ఎఫెక్ట్ ఇంకాస్త ఎక్కువే వుండొచ్చు. కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా వున్న అలియా భట్, కష్టంగానే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి డేట్స్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన డేట్స్ ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షెడ్యూల్ ప్లాన్ అయ్యింది.
లాక్‌డౌన్ దెబ్బకి ప్లానింగ్ అంతా దెబ్బతినేసింది. కొత్తగా మళ్ళీ ప్లానింగ్ చేస్తే.. అందుకు అలియా డేట్స్ సెట్టవుతాయా.? లేదా.? అన్న చర్చ షురూ అయ్యింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి సంబంధించి అలియాకి తప్ప ఇంకెవరికీ పెద్దగా టెన్షన్ వుండదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. కానీ, అలియా విషయంలో దర్శకుడు రాజమౌళి పూర్తి క్లారిటీతో వున్నాడు. అలియా కూడా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అనీ, ఆ సినిమాకే తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాననీ ప్రస్తుతానికి చెబుతోంది. మరి, ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయబ్బా.? నిప్పు లేకుండా పొగ రాదు కదా.! అన్నది నిజమేనంటారా.?