బాలీవుడ్ భామ అలియా భట్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. బాలీవుడ్‌లో బిజీగా సినిమాలు చేస్తూనే తెలుగులోనూ క్రేజీ ప్రాజెక్టులపై సైన్ చేస్తోంది అలియాభట్. ఆల్రెడీ తెలుగులో రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అలియా కోసం ఎదురు చూస్తున్నాయి తెలుగులో. ఇదిలా ఉంటే, హిందీలో ఐదారు ప్రాజెక్టులు అలియా చేతిలో ఉన్నాయి.
అలియాభట్ నటించిన 'బ్రహ్మాస్త్ర' విడదలకు సిద్ధంగా ఉంది. బిగ్‌బీ అమితాబ్‌తో పాటు, నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇన్షా అల్లా' అనే సినిమాలోనూ అలియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. రేపో మాపో సెట్స్ పైకి వెళ్లనుంది. సంజయ్‌దత్ నటిస్తోన్న 'సడక్ 2'లోనూ అలియాభట్ హీరోయిన్‌గా నటిస్తోంది.
విశేషమేంటంటే, అలియా నటిస్తున్న బిగ్ ప్రాజెక్టులు మూడూ కొద్ది రోజుల గ్యాప్‌లో వచ్చే ఏడాది జూలైలోనే విడుదల కానున్నాయట. నిజంగా ఇది అరుదైన విషయమే. ఆశ్చర్యకరమైన అంశం ఇంకోటేంటంటే, ఇంత బిజీగా ఉన్నప్పటికీ, మరిన్ని కొత్త ప్రాజెక్టుల్ని ఒప్పుకునే దిశగా అలియా సానుకూల ఆలోచనలు చేస్తోందట. డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో కానీ, అంత బిజీగా ఉన్నా, ఇంకా బిజీ కావాలనే అలియా కమిట్మెంట్‌కి హ్యాట్యాఫ్ అనాల్సిందే.