తొలి సినిమాకే సంచలనాలు నమోదు చేసిన హీరో కార్తికేయ. తొలి సినిమా 'ఆర్ ఎక్స్ 100' ఇచ్చిన ఉత్సాహంతో మనోడు వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. కేవలం హీరోగానే కాకుండా, విలక్షణ నటుడు అనిపించుకోవాలనుకుంటున్నాడు. హీరోగా రెండో సినిమా 'హిప్పీ' త్వరలో విడుదలకు సిద్ధమైంది. విలన్‌గా నాని సినిమా 'గ్యాంగ్‌లీడర్'లో నటిస్తున్నాడు. హీరోగా నటిస్తున్న మూడో తాజా సినిమా 'గుణ 369'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే, ఈ పోస్టర్‌లో కార్తికేయను వెనక నుండి చూపించారు. కండలు తిరిగిన దేహాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ చేతులు పైకెత్తి ఉన్న పోస్టర్ అది. మరో లుక్‌ని రిలీజ్ చేసేందుకు రేపు అనగా 29 మే ఉదయం 11గంటల 11 నిముషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అర్జున్ జంధ్యాల ఈ సినిమాకి దర్శకుడు. ఇదిలా ఉంటే, ఈ సినిమా టైటిల్ విషయంలో కొంత గందరగోళం నెలకొంది.
ఈ టైటిల్ మాదంటూ, కార్తికేయ అండ్ టీమ్ టైటిల్ మార్చుకోవాల్సి ఉందని కొందరు హడావిడి చేస్తున్నారు. అయితే 'గుణ' టీమ్ మాత్రం ఆదేమీ పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుంటూ పోతోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ స్పీడు చూస్తుంటే, ఈ ఏడాది చివర్లోనే 'గుణ 369' ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది.