విశ్వక్సేన్‌ టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?

మరిన్ని వార్తలు

ఇంతవరకూ అర్జున్‌రెడ్డి అదేనండీ విజయ్‌ దేవరకొండ గురించే ప్రత్యేకంగా చర్చించుకుంటూ వస్తున్నాం. అందుకు కారణం ఆయన ఆటిట్యూడ్‌. తాడిని తన్నేవాడుంటే, తలని తన్నేవాడుంటాడు.. అంటారు మన పెద్దలు. ఏ ఆటిట్యూడ్‌తో అయితే మనోడు 'రౌడీస్టార్‌' అంటూ ముద్దుగా పిలిపించుకుంటున్నాడో. అచ్చం అదే ఆటిట్యూడ్‌తో మరో రౌడీస్టార్‌ పుట్టుకొచ్చాడు. విజయ్‌దేవరకొండలాగే ఆటిట్యూడ్‌ ప్రదర్శిస్తున్నాడు. ఆయనే విశ్వక్సేన్‌. 'ఫలక్‌నుమా దాస్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మనోడు హీరో మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్‌. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించాడు.

 

విమర్శకుల ప్రశంసలతో పాటు, సుకుమార్‌ వంటి ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ధియేటర్స్‌లో సినిమా చించి పాడేస్తోందంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ, సోషల్‌ మీడియాలో ఎవరినో టార్గెట్‌ చేసి, విశ్వక్సేన్‌ సైలెంట్‌ వార్‌ నడిపిస్తున్నాడు. ఓపెన్‌గా ప్రెస్‌ మీట్లు పెట్టి, ప్రమోషన్స్‌ పేరుతో రెచ్చిపోయి ఆటిట్యూడ్‌ చూపిస్తున్నాడు. ఈ రెచ్చిపోవడం ఒకానొక సందర్భంలో శృతి మించిపోవడంతో, సారీ కూడా చెప్పాడు. కానీ, లేటెస్ట్‌గా మరోసారి విశ్వరూపం చూపించాడు. ఎవడ్రా నన్ను తొక్కేసేది.. అంటూ విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనా టాలెంట్‌ ఉంటే ఉండొచ్చుగాక, మరీ ఈ రేంజ్‌ ఆటిట్యూడ్‌ అంటే తట్టుకోవడం కష్టమే. విజయ్‌ దేవరకొండకి ఏదో అలా కలిసొచ్చేసింది. కానీ, ఈ ఆటిట్యూడ్‌తో విశ్వక్సేన్‌ నిలబడతాడా.? ఏమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS