దిల్‌రాజు జడ్జిమెంట్లపై సినీ జనాలకు నమ్మకం ఎక్కువ. పోస్టర్ చూసే ఆయన రిజల్ట్ చెప్పేయగల సమర్థుడు. దిల్ రాజు ఓ సినిమా కొన్నాడంటే - కచ్చితంగా ఆ సినిమాలో మేటర్ ఉండే ఉంటుంది. పంపిణీదారుడిగా దిల్ రాజు ట్రాక్ రికార్డులు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. అయితే పెద్ద సినిమాల్ని కొనడానికి ఆయన పెద్దగా సాహసించడు. చిన్న, ఓ మాదిరి సినిమాల్ని కొంటూ.. అందులోనే భారీగా సొమ్ము చేసుకోవడానికే ఇష్టపడతాడు. అయితే ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద రిస్క్ చేయడానికి ముందుకొచ్చాడు. సాహో సినిమాపై ఆయన 45 కోట్ల బెట్టింగ్ పెట్టడానికి రెడీ అయ్యాడు. నైజాం, ఉత్తరాంధ్ర రెండు ఏరియాలు కలిపి ఏకంగా 45 కోట్లు కోడ్ చేశాడట. సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే... ఈ రెండు ఏరియాలు కలిపి రూ.25 కోట్లకు కొనేయొచ్చు.
దానికి అదనంగా మరో 20 కోట్లు పెట్టుబడి పెట్టడానికి దిల్‌రాజు రెడీ అయ్యాడని టాక్. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సాహో హిట్టయితే బాహుబలి రికార్డులు కూడా కనిపించకుండా పోతాయి. ఆ నమ్మకంతోనే 45 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యాడట. కాకపోతే యూవీ మాత్రం ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకుంటూ బాగుంటుందని ఆలోచిస్తుంది. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా అమ్మకూడదని అనుకుంది.కాకపోతే. దిల్‌రాజు భారీ ఆఫర్ ఇచ్చి ఊరిస్తున్నాడు. సో.. సాహో నైజాం, ఉత్తరాంధ్ర హక్కులు దిల్ రాజు చేతికి వెళ్లిపోవడం ఖాయమైనట్టే