'రేసుగుర్రం 2'.... అంతా రెడీ!

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'రేసుగుర్రం'. ఆ త‌ర‌వాత వ‌చ్చిన 'స‌రైనోడు' రేసుగుర్రం రికార్డుల్ని తిర‌గ‌రాసింది... అది వేరే విష‌యం. ఇప్పుడు 'రేసుగుర్రం 2'కి స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు టాక్‌. సురేంద‌ర్ రెడ్డి ఇప్ప‌టికే `రేసుగుర్రం 2` అనే ఐడియా సిద్ధం చేశాడ‌ని, బ‌న్నీతోనే ఆ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం 'సైరా' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో సురేంద‌ర్ రెడ్డి బిజీగా ఉన్నాడు.

 

ఆ ప్రాజెక్టు అయ్యాక సూరి సినిమా ఎవ‌రితో అనేది ఇంకా తేల‌లేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు బ‌న్నీ. ఆ త‌ర‌వాత 'ఐకాన్‌' ప‌ట్టాలెక్కుతుంది. మ‌రోవైపు సుకుమార్ కూడా బ‌న్నీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇవి కాకుండా కొర‌టాల శివ‌తో కూడా బ‌న్నీ ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీటి మ‌ధ్య 'రేసుగుర్రం' ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో మ‌రి..?? ఒక‌వేళ 'సైరా' సూప‌ర్ డూప‌ర్ హిట్టై, సూరికి డిమాండ్ పెరిగితే - చేతిలో ఉన్న సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టి బ‌న్నీ 'రేసుగుర్రం' పైనే దృష్టి పెట్టే అవ‌కాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS