ఆదివారం స్టార్ట్ అయిన బుల్లితెర మెగా గేమ్ షో 'బిగ్‌బాస్ 3' హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునపై అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా బిగ్‌బాస్‌కి సంబంధించి హైపర్ యాక్టివ్‌గా రెస్పాండ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జునను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కొన్ని ట్రోలింగ్స్ అయితే, మరీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఫోటోలు, వీడియోల రూపంలో మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు. నాగార్జున అమ్మాయిలకే హగ్గులిస్తాడా? మగవాళ్లకు హగ్గులివ్వడా..? అంటూ ఆడి పోసుకుంటున్నారు.
అయితే, హేటర్స్ తెలుసుకోవల్సిందేంటంటే, నాగార్జున అబ్బాయిలకు కూడా హగ్గులిచ్చాడు. ఆ మాటకొస్తే అందరికీ హగ్గులిచ్చాడు. బాబా భాస్కర్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. అలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కే కాదు, స్టేజ్ కింద కూర్చున్న శ్రీముఖి సోదరుడికి కూడా నాగ్ స్వీట్ హగ్ ఇచ్చాడు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రూఫ్స్‌తో సహా అందుబాటులో ఉన్నాయి. అలాంటిది, తొలి రోజే నాగ్‌పై ఇలా మీమ్స్ చేయడం, అనవసరంగా ట్రోలింగ్స్ చేయడం సబబు కాదన్నది ఆయన ఫ్యాన్స్ ఉద్దేశ్యం.
ఇక ఈ సారి బిగ్‌బాస్ మస్త్ రసపట్టుగా వుండేలా కనిపిస్తోంది. ఓపెనింగ్ డేనే బిగ్‌బాస్ తొలి ముగ్గురు కంటెస్టెంట్స్కీ సీక్రెట్ టాస్క్ ఇచ్చేశారు. అంతేకాదు, ఫస్ట్ నామినేషన్ కూడా స్టార్టింగ్ డేనే రివీల్ చేసి, అందరికీ షాకిచ్చారు. శ్రీముఖి, వితికా షెరు, బాబా భాస్కర్, జాఫర్ పేర్లను తొలి నామినేషన్ జాబితాలో వేసి, వీక్షకుల్ని సస్పెన్స్‌లో పడేశారు.