టాలీవుడ్ మళ్లీ షూటింగులతో కళకళలాడుతోంది. అగ్ర హీరోలు... సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో మొదలవుతుందని ముందే సమాచారం అందింది. అందుకు ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈనెల 5 నుంచి `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే ఇది ట్రైల్ షూట్. 5 నుంచి 8వ వరకూ ట్రైల్ షూట్ చేస్తారు. ఆ తరవాత.. రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అసలైన షూటింగ్ మొదలైపోతుంది. ట్రైల్ షూట్ లో చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాల్గొంటార్ట.
అయితే ట్రైల్ షూట్ అయిన వెంటనే.. చరణ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఆ తరవాత ఎన్టీఆర్ సెట్లోకి అడుగుపెడతాడని సమాచారం. అక్టోబరు 22న ఎన్టీఆర్‌కి సంబంధించిన టీజర్ ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈలోగా ఎన్టీఆర్ పై టీజర్ షాట్స్ ని తెరకెక్కిస్తారు. అలియాభట్ కూడా అతి త్వరలోనే సెట్స్‌లోకి అడుగుపెట్టబోతోందని సమాచారం. మొత్తానికి `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ మోడ్‌లోకి వచ్చేసింది. ఇక నుంచి ఈ సినిమాకి సంబంధించి కబుర్లే కబుర్లు.