అల్ల‌రి నరేశ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ!

By iQlikMovies - November 12, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

హీరో అల్ల‌రి నరేష్ క‌థానాయ‌కుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రారంభం కానుంది. న‌రేష్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌రేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రో వైపు త‌న‌దైన మార్క్ కామెడీ మూవీ `బంగారు బుల్లోడు` సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. న‌రేశ్ న‌టించ‌బోయే కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

 

`మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS