ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలంటే ప్రొడ్యూసర్స్‌కి కాసుల పంటే. ఖచ్చితంగా హిట్ అయ్యేవి. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేవి. తొలి సినిమా టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్‌కు చాలా కాలం నుండీ టైం కలిసి రావడం లేదు. ఏది పట్టినా ఫలించడం లేదు. కామెడీ బోర్ కొట్టేసిందని, స్పూఫ్‌లతో కాలం వెల్లబుచ్చేశాడు. కొన్నాళ్లు ఆ స్పూఫ్‌లు నరేష్‌ని నిలబెట్టేశాయి. ఆ తర్వాత అవీ బోర్ కొట్టేశాయి. ఇక అలా కాదనీ, హీరర్ కామెడీని ఎంచుకుని అది కూడా ఫలించక మళ్లీ కామెడీ రైలెక్కేశాడు మనోడు. ఈ సారి సరికొత్త కామెడీతో మన ముందుకొస్తున్నానంటున్నాడు. ఆ కామెడీ ఏంటో, దానిలోని కొత్తదనం ఏంటో త్వరలోనే తెలుస్తుందంటున్నాడు అల్లరి నరేష్. మలయాళంలో విజయం సాధించిన 'ఒరు వడక్కన్ సెల్ఫీ' చిత్రం రీమేక్‌లో నరేష్ నటిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన ప్రజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'మేడమీద అబ్బాయి' అనే క్రేజీ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిఖిలా విమల్ ఈ సినిమాలో నరేష్‌కి జంటగా నటిస్తోంది. ఈ కొత్త రకం కామెడీతో ఈ సారి హిట్ కొడతాననీ నమ్మకంగా చెబుతున్నాడు నరేష్. మరో పక్క ఈ ప్రయత్నం ఫెయిలైతే, మరో కొత్త దారిని కూడా నరేష్ లైన్లో పెట్టేశాడట. అదేంటో త్వరలోనే తెలుస్తుందంటున్నాడు. అలాగే మహేష్ బాబు సినిమాలో నరేష్ నటిస్తున్నాడంటూ ఈ మధ్య గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విషయం గురించి నరేష్‌ని అడిగితే, మహేష్ సినిమా విషయంలో తనను సంప్రదించిన మాట వాస్తవమే అన్నాడు కానీ, క్లారిటీగా చెప్పకుండా మాట దాటేశాడు నరేష్.