గ్లామర్ ప్రపంచంలో క్రేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి క్రేజ్ దక్కాక ఇక అంతే, దాన్ని క్యాష్ చేసుకోవడమే. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అలా కాదంటోంది. తొలి సినిమాతోనే అందర్నీ ఫిదా చేసేసింది బ్యూటీ సాయి పల్లవి. అమ్మడి అందాన్ని కూడా పక్కన పెట్టేసి, ఆమె యాక్టింగ్కి ఫిదా అయిపోతున్నారంతా. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన 'ఫిదా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనని మెచ్చుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అస్సలు గ్లామరే లేకున్నా, కానీ కుర్రోళ్ల గుండెల్ని కొల్లగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో అమ్మడి యాక్టింగ్ టాలెంట్ చూసి, వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి ఈ ముద్దుగుమ్మని. కానీ అమ్మడు మాత్రం మరోలా ఆలోచిస్తోంది. కథ నచ్చితేనే సినిమా చేస్తాను కానీ, ఏది పడితే అది చేసేయ్యననీ ఒట్టు పెట్టుకుని కూర్చుందట. లక్షలు కుమ్మరించి తమ సినిమాలో అవకాశం ఇస్తామన్నా, కానీ ఈ బ్యూటీ మాత్రం పర్ఫామెన్స్కీ, స్టోరీ కాన్సెప్ట్కే వేల్యూ ఇస్తాననడం ఆశ్చర్యంగా ఉంది. హీరోయిన్స్ కెరీర్ అంటే అసలే చాలా షార్ట్ పిరియడ్. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. కానీ ఈ ముద్దుగుమ్మ అవేమీ లెక్క చేయకుండా, స్టోరీకి మాత్రమే తన తొలి ప్రాధాన్యత అంటోంది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి. మొత్తానికి తెలుగు సినిమాకి ఓ మంచి నటి దొరికిందనే చెప్పాలి సాయి పల్లవి విషయంలో. ఈ నేచురల్ బ్యూటీ మరో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న 'ఎమ్సిఏ' సినిమాలో నటిస్తోందనీ సమాచారమ్.