సినీ నటుడు అల్లరి నరేష్ దాదాపు నాలుగు ఏళ్ళ తరువాత మహర్షి చిత్రం తో సక్సెస్ చవి చూసాడు. అది అనుభవించే లోపే నరేష్ ఇంట ఓ విషాదం చోటు చేసుకుంది. నరేష్ తండ్రిగారైన ఈ.వి.వి సత్య నారాయణ గారి తల్లి ఈదర వెంకటరత్నమ్మ (వయసు 87) మరణించారు. 2011 లో ఈ.వి.వి మరణించినప్పటి నుంచి తన స్వగ్రామం, నిడదవోలు దగ్గరి కోరుమామిడి లో వెంకటరత్నమ్మ నివసిస్తున్నారు.
వృధాప్య కారణాల వల్ల ఆవిడ మరణించినట్టు సమాచారం. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ మరియు ఒక కుమార్తె ముళ్లపూడి మంగ. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, ఈ.వి.వి సోదరులు గిరి మరియు ఇతర సినీ పెద్దలు వెంకటరత్నమ్మ గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.