'నమో వేంకటేశాయ' తరవాత రాఘవేంద్రరావు నుంచి మరో సినిమా రాలేదు. ఆయన సినిమాల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారని, 'నమో వేంకటేశాయ'నే ఆఖరి సినిమా అని ప్రచారం జరిగింది. అయితే... ఇప్పుడు రాఘవేంద్రరావు మళ్లీ సినిమాలవైపు దృష్టి పెట్టారు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కె.రాఘవేంద్రరావు తన కొత్త సినిమా వివరాల్ని ప్రకటించారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో ఓ సినిమా చేస్తేన్నానని ప్రకటించారు.
''నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను'' అని ఫేస్ బుక్‌లో అభిమానులకు సంకేతం పంపారు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారా? నిర్మాతగానే ఉండిపోతారా? ఆ ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.