రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న రామ్‌ ‘రెడ్‌’!

మరిన్ని వార్తలు

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్‌’కి రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ, ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఇంతవరకూ యాక్షన్‌ మూడ్‌ చూపించిన రామ్‌ ఇప్పుడు డాన్సింగ్‌ మూడ్‌లో కనిపిస్తున్నాడు. రాపో లుక్స్‌లో మాస్‌ స్టెప్‌ ఇరగదీస్తున్నాడు. ఏప్రిల్‌ 9న ‘రెడ్‌’ రిలీజ్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘నేల టికెట్‌’ ఫేమ్‌ మాళవికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నివేదా పేతురాజ్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ పోషిస్తోంది. ఇటీవల రిలీజ్‌ చేసిన ‘రెడ్‌’ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

 

ఇకపోతే, కిషోర్‌ తిరుమల ` రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమా ఇది. గతంలో ‘నేను శైలజ’తో సూపర్‌ హిట్‌ కొట్టిన ఈ కాంబో మరోసారి ‘ఉన్నది ఒక్కటి జిందగీ’ కోసం వర్క్‌ చేసింది. అయితే, తొలి సినిమా ఇచ్చినంత క్రేజ్‌ రెండో సినిమాకి రాలేదు. ఇక ముచ్చటగా మూడో సినిమాగా రూపొందుతోన్న ‘రెడ్‌’పై అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి, ఆ అంచనాల్ని ఈ కాంబో మూడో సినిమాతో అందుకుంటుదో లేదో. రామ్‌ ఓన్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS