'న్యూడ్‌' షాక్‌ ఇచ్చిన అల్లరి నరేష్‌

By Inkmantra - January 20, 2020 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

కామెడీ హీరోనే అయినా, పలు సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు.. విమర్శల ప్రశంసలూ అందుకున్నాడు అల్లరి నరేష్‌ చాలా సినిమాలతో. ఇటీవల 'మహర్షి' సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించిన అల్లరి నరేష్‌, ఈసారి హీరోగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'నాంది' అనే టైటిల్‌తో కెరీర్‌లోనే సరికొత్త ఫేజ్‌కి నాంది పలుకుతున్నాడు ఈ విలక్షణ నటుడు. విజయ్‌ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

 

సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి నిర్మాత. సినిమా ఫస్ట్‌ లుక్‌ కాస్సేపటి క్రితం విడుదలయ్యింది. ఈ ఫస్ట్‌ లుక్‌లో అల్లరి నరేష్‌ అందరికీ షాకిచ్చేలా కన్పించాడు. పోలీస్‌ కస్టడీ గదిలో.. ఫ్యాన్‌ హుక్‌కి గొలుసులు కట్టేసి, ఆ గొలుసులకి రివర్స్‌లో అల్లరి నరేష్‌ని వేలాడదీశారు. ఒళ్ళంతా పోలీసు లాఠీలతో కమిలిపోయి వుంది. కాస్త స్లిమ్‌గా కూడా కన్పిస్తున్నాడు అల్లరి నరేష్‌. పూర్తి గడ్డంతో ఫేస్‌ వుంది. ఓవరాల్‌గా ఈ లుక్‌ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ మరో కీలక పాత్రలో కన్పించబోతోంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై ఎవరూ టచ్‌ చేయని ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటిదాకా కామెడీ హీరోగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూస్తారంటున్నాడు అల్లరి నరేష్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS