క్రైమ్‌ థ్రిల్లర్‌లో నరేష్‌ 'అల్లరి'!

By Inkmantra - January 21, 2020 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

తనదైన శైలి కామెడీతో, మినిమమ్‌ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్‌. అయితే, ఈ మధ్య నరేష్‌ కామెడీ బోర్‌ కొట్టేసింది. కామెడీలో ఎన్ని వేరియేషన్స్‌ చూపించినా అబ్బే.. జనానికి ఎక్కడం లేదు. సింపుల్‌గా పెదవి విరిచేస్తున్నారు. దాంతో, నరేష్‌ పూర్తిగా జానర్‌ ఛేంజ్‌ చేసేశాడు. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు. అదే 'నాంది' చిత్రం. వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభిస్తూనే, ఓ ఇంటెన్స్‌ ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్‌ చేసి, ప్రారంభంలోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు.

 

విజయ్‌ కనక మేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండగా, సతీష్‌ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కంటెన్ట్‌ కరెక్ట్‌గా ఉంటే, క్రైమ్‌ థ్రిల్లర్స్‌కి ఆడియన్స్‌ బ్రహ్మ రథం పడుతున్నారిప్పుడు. అలాంటిది ఓ ఇంటెన్స్‌ స్టోరీతో అల్లరి నరేష్‌ నటిస్తున్న 'నాంది' చిత్రం ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటుందో వేచి చూడాలి మరి. ఇక సినిమా విషయానికి వస్తే, రేపటి నుండే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. మార్చికల్లా షూటింగ్‌ పూర్తి చేసి, సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌ చేయనున్నారట. ఇటీవల 'మహర్షి' సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌ పోషించి ఆకట్టుకున్న అల్లరి నరేష్‌కి ఈ సినిమాతో మంచి బ్రేకప్‌ వస్తుందని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS