మ‌హ‌ర్షి త‌ర‌వాత‌... మ‌రోసారి!

By Gowthami - August 04, 2021 - 17:01 PM IST

మరిన్ని వార్తలు

రాజేంద్ర ప్ర‌సాద్ త‌ర‌వాత‌... కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు అల్ల‌రి న‌రేష్‌. ప‌దా... ఇర‌వైనా..? అతి త‌క్కువ స‌మ‌యంలోనే 50 సినిమాల మైలురాయిని చేరుకున్నాడు. అయితే చాలా ఏళ్లుగా హిట్ ద‌క్క‌లేదు. అలాంటి స‌మ‌యంలో `మ‌హ‌ర్షి`లో ఓ కీల‌క మైన పాత్ర చేశాడు న‌రేష్‌. ఈ సినిమా హిట్ట‌వ్వ‌డంతో.. న‌రేష్ కి ఆరూపంలో బ్రేక్ దొరికిన‌ట్టైంది. ఆమ‌ధ్య `నాంది`తో సోలో హీరోగా త‌న ఖాతాలో మ‌రో హిట్ వేసుకున్నాడు. ఇప్పుడు `స‌భ‌కు న‌మ‌స్కారం` అనే సినిమా చేస్తున్నాడు.

 

హీరోగా త‌న కెరీర్ కి మ‌ళ్లీ ఊపొచ్చిన త‌రుణంలో.. మ‌ళ్లీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా `మ‌హ‌ర్షి` దారిలోనే న‌డుస్తున్నాడు. అవును.. ఓ సినిమాలో న‌రేష్ కీ రోల్ పోషించ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ సినిమా మ‌రెవ‌రిదో కాదు. మంచు మ‌నోజ్‌ది. చాలా గ్యాప్ త‌ర‌వాత మ‌నోజ్ చేస్తున్న సినిమా `అహం బ్ర‌హ్మ‌స్మి`. ఇందులో న‌రేష్ ఓ కీల‌కమైన పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. నిజానికి ఈ పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌నోజ్ - తేజ్ మంచి స్నేహితులు. ఆ ఫ్రెండ్ షిప్ కొద్దీ.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని చెప్పుకున్నారు. కానీ సాయి డేట్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో.. న‌రేష్ తో లాగించేస్తున్నార్ట‌. కాక‌పోతే.... ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం రావాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS