అలీబాబా... డ‌జ‌ను దొంగ‌లు

By iQlikMovies - May 11, 2022 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అలీబాబా అర‌డ‌జ‌ను దొంగ‌లు ఒక‌టి. రాజేంద్ర ప్రసాద్‌కీ, అర‌డ‌జ‌ను దొంగ‌ల‌కీ మ‌ధ్య జ‌రిగే స‌ర‌దా సంగ‌తులు వినోదాన్ని పంచుతాయి. ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ క‌మెడియ‌న్లంతా.. ఆ సినిమాలో క‌నిపిస్తారు. అంద‌రివీ పెద్ద పెద్ద పాత్ర‌లే. దాదాపుగా హీరోతో స‌మాన‌మైన క్యారెక్ట‌ర్ల‌వి. అందుకే ఆ సినిమా గుర్తుండిపోతుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా అలీబాబా డ‌జ‌ను దొంగ‌లు అనే సినిమా తీయాల‌ని ఉంద‌ని చెప్పాడు న‌రేష్. దానికి త‌గిన స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంద‌ట‌.

 

``నాన్న‌గారి సినిమాల్లో అలీబాబా అర‌డ‌జ‌ను దొంగ‌లు అంటే నాకు చాలా ఇష్టం. దానికి త‌గిన సీక్వెల్ ఆలోచ‌న కూడా ఉంది. ఆ అర‌డ‌జ‌ను దొంగ‌ల‌కు పిల్ల‌లు పుట్టి.. డ‌జ‌ను దొంగ‌లైతే ఎలా ఉంటుంద‌న్న‌ది క‌థ‌. అయితే... ఒక్క‌టే స‌మ‌స్య‌. అప్ప‌టి హాస్య‌న‌టుల్లో చాలామంది లేరు. వాళ్ల‌ని భ‌ర్తీ చేసే క‌మెడియ‌న్లు కూడా మ‌న‌కు లేరు. జంబ‌ల‌కిడి పంబ‌కి సీక్వెల్ చేద్దామ‌ని ఓ ద‌ర్శ‌కుడు న‌న్ను సంప్ర‌దించాడు. ఆ సినిమా అన్నా నాకు ఇష్ట‌మే. కానీ అప్ప‌టి న‌టీన‌టుల్నిరిప్లేస్ చేయ‌డం చాలా క‌ష్టం. అందుకే వ‌ద్ద‌ని సున్నితంగా చెప్పాను`` అని చెప్పుకొచ్చాడు న‌రేష్‌. త‌ను క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చి.. మంగ‌ళ‌వారంతో 20 ఏళ్లు పూర్త‌య్యాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS