సమ్మర్ సీజన్ సినిమాల హడావిడి ముగుస్తుంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు వచ్చేశాయి. సర్కారు వారి పాట, ఎఫ్ 3 సందడి కూడా మొదలైపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ ద్రుష్టి ఆగస్ట్ పై పడింది. ఇప్పటికే మూడు సినిమాలు ఆగస్ట్ 12ని లాక్ చేసుకున్నాయి. అఖిల్ - సురేందర్ రెడ్డిల ఏజంట్, నితిన్ రాజశేఖర్ రెడ్డిల మాచర్ల నియోజక వర్గం, సమంత యశోద .. ఈ మూడు సినిమాలు కూడా ఆగస్ట్ 12 న వస్తున్నాయి. ఐతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే డేట్ పై ద్రుష్టి పెట్టారు.
చిరంజీవి, మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చింది. ఆచార్య చేదు జ్ఞాపకాల్ని గాడ్ ఫాదర్ తుడిచేయాలని భావిస్తున్నారు చిరు. అందుకే ఈ సినిమా వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ కి కూడా ఆగస్ట్ 12కే ఓటు వేశారని తెలిసింది.
ఆగస్ట్ 12 స్పెషాలిటీ ఏమిటంటే.. ఇండిపెండెన్స్ డే పండుగ కలసిరావడమే దీనికి కారణం. శని, అదివారలతో పాటు సోమవారం కూడా సెలవు దినం కావడం అందులోనూ ఇండిపెండెన్స్ డే లాంటి మెగా ఛాన్స్ ని ఎవరూ వదులుకోరు. గాడ్ ఫాదర్ యూనిట్ ఆలోచన ఇదే. ఐతే మెగాస్టార్ బరిలోకి దిగితే.. మిగాతా మూడు సినిమాలు తప్పుకుంటాయా ? రేసులో నిలబడతాయా? అనేది ప్రశార్ధకంగా వుంది. ఆ మూడు సినిమాలు మంచి అంచనాలు వున్న సినిమాలే కానీ చిరంజీవి సల్మాన్ ఖాన్ లతో పోటీపడ దగ్గ సినిమాలు కావనే చెప్పాలి. కొంచెం తేడా జరిగినా నష్టపోయి ప్రమాదం వుంది. ఒకవేళ మెగాస్టార్ వస్తే కనుక ఈ మూడు సినిమాలు డ్రాప్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి