మహేష్ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఏంటంటే

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం వంశీ పైడిపల్లి దర్వకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్‌ మరో నెల రోజుల పాటు డెహ్రాడూన్‌ అందాల్ని ఎంజాయ్‌ చేయనుంది. ఈ షెడ్యూల్‌లో ఇటీవలే ఆల్రెడీ కాలేజ్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న చిత్ర యూనిట్‌ కీలక పాత్రధారులైన అల్లరి నరేష్‌, హీరోయిన్‌ పూజా హెగ్దే తదితర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. 

అయితే ఈ సినిమాలో మహేష్‌, నరేష్‌ పాత్రలు ఇవీ అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మహేష్‌ శ్రీమంతుడి పాత్రలోనూ, అల్లరి నరేష్‌ పేదవాడి పాత్రలోనూ కనిపించబోతున్నారట అంటూ ఓ వైపు. కాదు, కాదు అల్లరి నరేష్‌ది శ్రీమంతుడి పాత్ర, మహేష్‌బాబుది పేదవాడి పాత్ర అంటూ మరోవైపు చర్చ జరుగుతోంది. అసలింతకీ ఈ ఇద్దరి పాత్రలూ వీటిలో ఏవై ఉంటాయన్నది చిత్ర యూనిట్‌ అఫీషియల్‌గా క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. 

ఇద్దరు స్నేహితుల మధ్య సాగే హృద్యమైన కథగా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. అయితే వంశీ పైడిపల్లి అందరూ ఊహించినట్లుగానే వీరి పాత్రలను డిజైన్‌ చేసి ఉంటాడా? లేక సమ్‌థింగ్‌ ఛేంజ్‌ చేసి ఉంటాడా? అంటూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరో విషయం గమనించాల్సిందేమంటే అసలు అల్లరి నరేష్‌ది పోజిటివ్‌ క్యారెక్టరా? నెగిటివ్‌ క్యారెక్టరా? అనే అనుమానం కూడా కలుగుతోంది.

 

ఇకపోతే 'భరత్‌' విజయంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS