కామెడీ హీరోగా తనదైన శైలిని ప్రదర్శించి, మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతలకు కంఫర్టబుల్ హీరో అనిపించుకున్న అల్లరి నరేష్ కెరీర్ ప్రస్తుతం అంత బాగా లేదు. తనను ఆ స్థాయిలో నిలబెట్టిన ఆ కామెడీ జోనర్ ఇప్పుడు వర్కవుట్ కావడం లేదు. దాంతో రూటు మార్చేశాడు. మొన్న 'సిల్లీ ఫెలోస్' అంటూ సునీల్‌తో కలిసి కంబైన్డ్‌గా కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఓకే అనిపించుకున్నాడు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో అల్లరోడు అల్లరి చేయబోతున్నాడు.
ఈ సినిమాకి అల్లరి నరేష్ పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర కోసం అల్లరోడిని ఏరి కోరి ఎంచుకున్నాడట డైరెక్టర్ వంశీ పైడిపల్లి. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడనీ, అల్లరి నరేష్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయనీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెబుతున్నారు. వాస్తవానికి అల్లరి నరేష్ కామెడీ హీరోగా సెటిలైనా, ఆయనలో రకరకాల నటులు దాగి ఉన్నారన్న సంగతి కూడా అప్పుడప్పుడూ ప్రూవ్ అయ్యింది.
నటనలో ఏ వేరియేషన్‌నైనా అల్లరి నరేష్ ఇట్టే మ్యాచ్ చేసేయగలడు. ఇప్పుడు 'మహర్షి'లోనూ అంతే. పక్కన సూపర్‌స్టార్ ఉన్నప్పటికీ, అల్లరి నరేష్ సమ్‌థింగ్ ఎట్రాక్షన్ ఏదో చూపిస్తున్నాడు తన అప్పీల్‌లో. ఈ సినిమా ఖచ్చితంగా అల్లరోడి కెరీర్‌కి బాగా తోడ్పడుతుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ బిజీ అయిపోవడం పక్కా అంటున్నారు. సినిమా సక్సెస్ అయినా, ఫెయిలైనా అల్లరి నరేష్ పాత్ర మాత్రం అలా గుర్తుండిపోతుంది ఇది పక్కా అంటున్నారు. అల్లరోడి భవిష్యత్తును 'మహర్షి' ఎలా రాశాడో మరో ఐదు రోజుల్లోనే తెలిసిపోనుంది. మే 9న 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది.