యాక్టర్‌ కాకుంటే త్రిష ఏమయ్యేదో తెలుసా.!

By iQlikMovies - May 04, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌హీరోల సరసన హీరోయిన్‌గా నటించి, ఇప్పటికీ యాక్టింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న అందాల భామ త్రిష పుట్టినరోజు ఈ రోజు. హీరోయిన్‌గా 60 సినిమాలు పూర్తి చేసుకున్న త్రిష 36వ పుట్టినరోజు జరుపుకుంటోంది ఈ రోజు. ఈ సందర్భంగా త్రిషకు సంబంధించిన కొన్ని ఆశక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం. హీరోయిన్‌ కాకుంటే, త్రిష క్రిమినల్‌ సైకాలజిస్ట్‌ అయ్యేదట. అయితే విధి ఆమెను యాక్టింగ్‌ వైపు నడిపించింది. యాక్టింగ్‌లో ఉన్నత శిఖరాలను అందుకునేలా చేసింది.

 

త్రిష కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. టాలీవుడ్‌లో చిరంజీవి మొదలుకొని, పలువురు యంగ్‌ హీరోల సరసన కూడా త్రిష నటించింది. 2015లో వరుణ్‌ అనే బిజినెస్‌ మేన్‌తో నిశ్చితార్ధం చేసుకున్న త్రిష తర్వాత సినిమాల్లో నటించదనుకున్నారంతా. కానీ, అదే కారణంతో త్రిష ఆ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంది.

 

తనకి లైఫ్‌ పాట్నర్‌ కావాలనుకున్న వ్యక్తి, తన కెరీర్‌కి అడ్డు తగులుతున్నాడని గ్రహించిన త్రిష మరో ఆలోచన చేయకుండా, నిశ్చితార్ధం రద్దు చేసుకుని, కెరీర్‌నే ప్రాణంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తమిళంలో నయనతార తర్వాతి స్థానం త్రిషదే అని చెప్పొచ్చు. ఓ పక్క హీరోయిన్‌గా, మరోపక్క హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తోనూ జోరుగా ఉంది త్రిష. హిందీలో అక్షయ్‌కుమార్‌తో 'కట్టా మీటా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష, తొలి సినిమాకే మంచి పేరు దక్కించుకుంది. తెలుగులో త్రిష రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది. మంచి అవకాశం వస్తే, తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్‌ చేయడానికి అందాల త్రిష రెడీగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS