బ్రాండ్ బాబు పై పోలీసు కేసు

By iQlikMovies - August 05, 2018 - 10:54 AM IST

మరిన్ని వార్తలు

దర్శకుడు మారుతి కథ, మాటలు అందివ్వగా బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన ప్రభాకర్ దర్శకత్వం వహించిన చిత్రం బ్రాండ్ బాబు. ఈ సినిమాతో సుమంత్ శైలేంద్ర హీరోగా తెలుగు చిత్రసీమకి పరిచయమయ్యాడు.

ఇక్కడ వరకు బాగానే ఉంది, అయితే ఈ చిత్రం పైన అనూహ్యంగా ఒక పోలీసు కేసు నమోదైంది. ఆ కేసు ఏంటంటే- ఈ చిత్రంలో ఒక మహిళ జర్నలిస్ట్ ఫోటోని ఆమె అనుమతి లేకుండా వాడటం పైగా సదరు వ్యక్తి చనిపోయినట్టుగా అందులో చూపెట్టడం జరిగింది.

అయితే తన అనుమతి లేకుండా పేస్ బుక్ నుండి ఆ ఫోటోని తీసుకుని సినిమాలో వాడుకున్న కారణంగా ఆమె ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు పై బ్రాండ్ బాబు టీం స్పందించాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS