సినిమాని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు: అల్లు అరవింద్

By iQlikMovies - April 30, 2018 - 20:57 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.

ఇక ఈ ఈవెంట్ లో ప్రసంగించిన అల్లు అరవింద్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు. అదేంటంటే- గత రెండు నెలలుగా సినిమా పరిశ్రమలో జరిగిన కొన్ని అంశాల వల్ల ఒక రెండు మూడు కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినట్టుగా తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ తో పాటుగా బ్యాడ్ టాక్ ని కూడా ఈ చిత్రం విడుదల సమయంలో సృష్టించాలి అని ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. అయితే దీనిని అభిమానులు, సామన్య ప్రేక్షకులు తిప్పి కొట్టాలి అని పిలుపునిచ్చారు.

ఈ ప్రసంగంలో ఈ అంశం మాట్లాడుతూ- బన్నీ.. దీనికి సంబందించిన పూర్తి వివరాలు నీకు తరువాత చెబుతాను అని చెప్పడం కొసమెరుపు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS