సంచలనాలకి కేంద్ర భిందువుగా మారిన శ్రీ రెడ్డి ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అది మరెవరో పైన కాదు తన ఆవేదనని అర్ధం చేసుకుని రెండు చిత్రాలలో అవకాశాలు ఇచ్చిన దర్శకుడు తేజ.
పూర్తి వివరాల్లోకి వెళితే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే తేజ కూడా దగ్గుబాటి కుటుంబంతో తనకి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్టుగా వెల్లడించింది. అయితే తాను వాటికి ససేమిరా అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అలాగే తాను ఫిలిం చాంబర్ లో అర్ధనగ్న ప్రదర్శన చేసేముందే కొందరు మధ్యవర్తుల ద్వారా దగ్గుబాటి కుటుంబం రాజీ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలిపారు.
మొత్తానికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన చేసిన అభ్యంతర వ్యాఖ్యల తరువాత మళ్ళీ ఇప్పుడు ఒక దర్శకుడు అయిన తేజ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరి దీనికి దర్శకుడు తేజ వైపు నుండి ఏదైనా కౌంటర్ వస్తుందా లేదా అనేది చూడాలి.