ఓ హీరో వదిలేసిన కథ... మరో హీరో దగ్గరకు వెళ్లడం ఏమాత్రం కొత్త కాదు. అది పరిశ్రమలో నిత్యం జరిగే తంతే. తాజాగా అల్లు అర్జున్ వదిలేసిన ఓ కథ రామ్ దగ్గరకు చేరిందని టాక్. అవును... అల్లు అర్జున్ కోసం తమిళ దర్శకుడు మురుగదాస్ ఓ కథ పట్టుకుని తిరుగుతున్నారు. బన్నీ - మురుగ కాంబో పై వార్తలు రావడానికి కారణం అదే. బన్నీ కూడా మురుగదాస్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు. ఇటీవల ఇద్దరి మధ్యా కథా చర్చలు కూడా జరిగాయి. కానీ మురుగదాస్ చెప్పిన కథ.. బన్నీని టెమ్ట్ చేయకలేపోయింది. దాంతో.. బన్నీ సున్నితంగా నో చెప్పి తప్పించుకున్నాడు.
అయితే మురుగదాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రామ్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. రామ్ ఈమధ్య తమిళ ఇండ్రస్ట్రీపై ఫోకస్ చేశాడు. తెలుగు, తమిళం.. ఇలా ద్విభాషా చిత్రాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. లింగు స్వామి కథని ఓకే చేయడానికి కారణం అదే. అందుకే మురుగదాస్ తో కూడా భేటీ వేశాడట. ప్రస్తుతం రామ్ - మురుగదాస్ మధ్య చర్చలు నడుస్తున్నాయని, మురుగదాస్ తో సినిమా చేయడానికి రామ్ కూడా దాదాపుగా అంగీకారం తెలిపాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.