నీళ్లొదిలేసిన స్క్రిప్టుకి కొత్త చిగుర్లు

By Gowthami - April 08, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

`ఐకాన్‌`.... ఈ పేరు గుర్తుంది క‌దా? అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా `ఐకాన్‌` పేరుతో ఓ సినిమా చేయాల‌ని దిల్ రాజు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. త‌న ఆస్థానంలో యేళ్ల త‌ర‌బ‌డీ ఉన్న ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రాసిన క‌థ ఇది. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్నీ ఆయ‌న‌కే అప్ప‌గించారు. షూటింగ్ మొద‌ల‌వ్వాల్సిన త‌రుణంలో.. ఆ సినిమా ఆగిపోయింది. ఆ క‌థ మ‌రీ క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు దూరంగా ఉంద‌ని బ‌న్నీ భ‌య‌ప‌డ‌డంతో... సినిమాని ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌రోసారి `ఐకాన్‌` పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈరోజు అల్లు అర్జున్ జ‌న్మ‌దినం.

 

ఈ సంద‌ర్భంగా `ఐకాన్‌` టీమ్ బ‌న్నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిందా. దాంతో `ఐకాన్‌`పై మ‌ళ్లీ ఆశ‌లు చిగురించాయి. ఈ సినిమా ఆగిపోతే, బ‌న్నీ ఈ సినిమాని ప‌క్క‌న పెడితే.. చిత్ర‌బృందం పోస్ట‌రు ఎందుకు విడుదల చేస్తుంద‌న్న‌ది బ‌న్నీ అభిమానుల మాట‌. ఈ క‌థ బ‌న్నీకి విప‌రీతంగా న‌చ్చింద‌ని, అందుకే ఇప్పుడు కాక‌పోయినా, రెండేళ్ల త‌ర‌వాతైనా ఈ సినిమా బ‌న్నీ చేస్తాడ‌ని దిల్ రాజు టీమ్ గ‌ట్టిగా న‌మ్ముతోంది. అందుకే... ఈ స‌మ‌యంలో పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సో. ఐకాన్ ఇంకా బ‌న్నీ చేతుల్లోనే ఉంద‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS