ఈ క‌థ మెగా బ్ర‌ద‌ర్స్ లో ఎవ‌రి కోసం?

By Gowthami - April 08, 2020 - 10:26 AM IST

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన `లూసీఫ‌ర్‌`ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. ఈ సినిమా హ‌క్కులు రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రున్నాయి. ఈ సినిమాని రీమేక్ చేయాల‌ని వుంద‌ని ఓ సంద‌ర్భంలో చిరంజీవినే స్వ‌యంగా చెప్పారు. అయితే ఆ త‌ర‌వాత లూసీఫ‌ర్ రీమేక్ గురించి ఎలాంటి అప్ డేటూ లేదు. కాక‌పోతే... ఈలోగా చిరంజీవి ఆలోచ‌న‌లు మారిన‌ట్టు తెలుస్తోంది. ఈ క‌థ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో రీమేక్ చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో చిరు ఉన్నాడ‌ట‌. రామ్ చ‌ర‌ణ్ ప్రొడ‌క్ష‌క్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ఓ సినిమా వ‌స్తే బాగుంటుంద‌న్న‌ది అభిమానుల ఆశ‌. చ‌ర‌ణ్ కూడా బాబాయ్ తో ఓ సినిమా చేస్తా అని చాలాసార్లు చెప్పాడు. ఆ అవ‌కాశం లూసీఫ‌ర్ రూపంలో వ‌చ్చింద‌నుకోవాలి.

 

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో లూసీఫ‌ర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశాడు చిరంజీవి. లూసీఫ‌ర్ రీమేక్ రైట్స్ ని త‌న కోస‌మే తీసుకున్నార‌ని, అయితే ప‌వ‌న్ అడిగితే ఈ క‌థ ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని తేల్చేశాడు చిరు. లూసీఫర్ రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న ప‌వ‌న్ కి ఉందో లేదో తెలీదు గానీ, తెర వెనుక మాత్రం చ‌ర‌ణ్ త‌న ప్ర‌యత్నాలు మొద‌లెట్టేసిన‌ట్టే ఉన్నాడు. అయితే ఈ క‌థ ప‌వ‌న్ కంటే చిరుకే బాగా సూట్ అవుతుంది. లూసీఫ‌ర్ సినిమా చూసిన‌వాళ్లెవ‌రైనా ఈ మాటే చెబుతారు కూడా. ప‌వ‌న్ కోసం చ‌ర‌ణ్ మ‌రో క‌థ వెదుక్కోవ‌డం బెట‌ర్‌. కానీ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గొచ్చు. లూసీఫ‌ర్ విష‌యంలో ఏమ‌వుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS