కూతురి ముచ్చట్లు బుక్కయిపోయిన బన్నీ.!

మరిన్ని వార్తలు

'చందమామ రావే జాబిల్లి రావే..' ఈ పాట వినని తెలుగువారుండరు. నెలల వయసులోనే ప్రతీ తల్లి తన బిడ్డకు చంద్రున్ని చూపించి గోరుముద్దలు తినిపిస్తుంది. చందమామ వస్తుందా.? రాదు. మరి తల్లి అబద్దం చెప్పిందనుకోవాలా.? నెలల వయసులో పిల్లలకు అబద్దం చెప్పినందుకు తల్లితండ్రులను జైలులో పెట్టాలా.? అసలు విషయానికి వెళ్తే అల్లు అర్జున్‌ తన కుమార్తెతో సరదాగా ఆడి పాడుతున్న సందర్భాన్ని సోషల్‌ మీడియాలో వీడియోగా పోస్ట్‌ చేశాడు. 

 

ఆ వీడియో ఇప్పుడు వివాదాలకు కారణమయ్యిందట. ఎందుకంటే అందులో అల్లు అర్జున్‌ తన కూతురితో 'నేను చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని అల్లు అర్జున్‌ ఆదేశించడమేనట...' మానసిక వైద్య నిపుణులు, మేధావులు అల్లు అర్జున్‌ని తప్పు పట్టేస్తున్నారట. అది తప్పే అయితే, నేరమే అయితే దేశంలో ఉన్న జైళ్లు సరిపోవు తల్లితండ్రుల కోసం. అల్లు అర్జున్‌ సెలబ్రిటీ కాబట్టి, ఏదో వివాదం సృష్టిస్తే, సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవ్వొచ్చు అని కొందరు సృష్టించిన దురుద్దేశ ఫలితమిది.

 

 వివాదాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్‌ వీడియో చూసి, సోదరుడు అల్లు శిరీష్‌ ఫన్నీగా ఒక రిప్లై ఇచ్చాడు. చిన్న వయసప్పుడే నీ కూతుర్ని బ్రెయిన్‌ వాష్‌ చేసేస్తున్నావ్‌.. టిపికల్‌ దేశీ ఫాదర్‌..' అని పెట్టాడు. ఇంకోపక్క 'నువ్వేమో ప్రేమ వివాహం చేసుకుని నీ కూతురుకి మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లే చేస్తావా.. అంటూ సీరియస్‌గానే తిట్టేస్తున్నారు ఇంకొందరు హేటర్స్‌. అదీ సంగతి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS