గ్లామ్‌షాట్‌: చిరిగిన నిక్కర్లో భయపెట్టే సొగసులు.!

మరిన్ని వార్తలు

గాగుల్స్‌లో ఉంది కదా గుర్తు పట్టలేదా.? ఈ పిక్‌లో ఉన్న ముద్దుగుమ్మ సుపరిచితురాలే. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో అమలగా దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించిన ముద్దుగుమ్మ నందితా శ్వేత. మెయిన్‌ హీరోయిన్‌గా కాకున్నా ఇటు తెలుగులోనూ, అటు తమిళ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించేసింది.

 

కళ్లలోనే అన్ని భావాలు పలికించగల సత్తా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో 'అక్షర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో నందితా దెయ్యం పాత్రలోనే కనిపించనుంది. దాంతో పాటు తమిళంలో మూడు ప్రాజెక్టులు, కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల తెలుగులో 'శ్రీనివాస కల్యాణం', బ్లఫ్‌ మాస్టర్‌' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయింది.

 

ఇదిలా ఉంటే, సోషల్‌ మీడియాలో వెరీ రేర్‌గా అందాల ఆరబోతతో నెటిజన్స్‌ని సంతోషపెడుతూ ఉంటుంది. అలా ఈ బ్యూటీ తాజాగా పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. టోన్డ్‌ జీన్స్‌లో తన చక్రాల్లాంటి కళ్లను గాగుల్స్‌తో కవర్‌ చేసి క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో హాట్‌ అప్పీల్‌ ఇస్తోంది మీకోసం. లెట్స్‌ ఎంజాయ్‌ దిస్‌ గ్లామర్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS