క్రేజీయెస్ట్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'గీత గోవిందం'. పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో క్రేజీ స్టార్ రష్మికా మండన్నా విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తోందీ సినిమాలో. ఈ సినిమా ఫస్ట్‌లుక్ నుండీ ఆశక్తిని క్రియేట్ చేస్తోంది. అదే ఆసక్తి కంటిన్యూ అవుతూనే ఉంది.
సోషల్ మీడియాలో గీత, గోవిందం అంటూ విజయ్ దేవరకొండ, రష్మికా చేస్తున్న అల్లరి, పోస్టర్స్‌తో వీరిద్దరూ చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఈ సినిమా నుండి విడుదలయ్యే ప్రతీ పోస్టర్‌నీ వినూత్నంగా డిజైన్ చేశారు. అసలే యూత్‌లో క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఇక ఆయన నుండి వస్తున్న సినిమా అంటే తెలియకుండానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ దిశగా 'గీత గోవిందం' సినిమాపై కూడా భారీగా అంచనాలున్నాయి.
కథ ఏంటి.? కథనమేంటి? అనే ఆలోచన ఉండదు విజయ్ దేవరకొండ చిత్రాలకు. స్క్రీన్‌పై ఏదో మాయ చేసేస్తాడంతే. అందుకే వరుసపెట్టి సినిమాలు విజయ్ దేవరకొండను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. ఇకపోతే తాజా చిత్రం 'గీత గోవిందం' విషయానికి వస్తే, ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని ఈ నెల 29న ఫిలిం నగర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఇదీ ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్.
మరోవైపు విజయ్ దేవరకొండ నటించిన 'టేక్సీవాలా' చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 'నోటా', 'డియర్ కామ్రేడ్' చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో పక్క వాణిజ్య ప్రకటనలతోనూ కిర్రాకు పుట్టిస్తున్నాడు విజయ్ దేవరకొండ.