నాని-నాగ్ ల 'దేవ్ దాస్' స్టోరీ లీక్..!?

By iQlikMovies - July 26, 2018 - 18:19 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున-నానిల కాంబినేషన్ లో వస్తున్న 'దేవ్ దాస్' చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త ఈ చిత్రానికి సంబంధించిన కథ అని తెలుస్తున్నది.

ఈ సినిమా కథ దాదాపు 10 ఏళ్ళ క్రితం బాలీవుడ్ లో వచ్చిన ఓ చిత్రానికి ఇది ప్రేరణ అని అంటున్నారు. పైగా రెండు ప్రధాన పాత్రలు ఉన్న ఈ చిత్రంలో ఒక పాత్ర క్లైమాక్స్ లో మరణిస్తుంది అని ఇప్పుడు సంచరిస్తున్న వార్త సారాంశం. అదే గనుక నిజమైతే ఈ చిత్రం ఒప్పుకున్న ఈ ఇద్దరి హీరోల ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిందే.

అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న అశ్వినీదత్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు అని అనుకోవాలి. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరిదశకి చేరుకుంది. శమంతకమణి చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నది లేనిది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS